మహేష్ ‘మహర్షి’ గురించి ఆసక్తికరమైన వార్త !

Published on Aug 12, 2018 8:20 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ సినిమా మీద వున్నా అంచనాలను రెట్టింపు చేసింది. ఇక ఈ చిత్రం గురించి మరోక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈచిత్రంలోని సెకండ్ హాఫ్ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందట. పేదవాడిగా నటిస్తున్న హీరో అల్లరి నరేష్ కోసం మహేష్ ఆ ఊరికి వస్తాడట. ఆతరువాతఊరులోని సమస్యను ఎలా పరిష్కరించాడనేది మిగితా కథ అని చెప్పికుంటున్నారు. ఈ వార్తలు నిజమో కాదో తెలియదు కానీ మహేష్ కి మాత్రం విల్లెజ్ సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. ఇటీవల ఆయన నటించిన ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’ సినిమాల్లో పల్లెటూరి ఎపిసోడ్లు ఆ చిత్రాలు ఘన విజయం సాధిచడంలో కీలక పాత్రను పోషించాయి. ఇప్పుడు మహర్షి కి కూడా ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవా లో జరుగుతుంది. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథనాయికగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్, పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

X
More