
సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘సైరా’ చిత్రం ఇటీవలె జరిగిన షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. కాగా తర్వాత షెడ్యూల్ కోసం చిత్రబృందం జార్జియా వెళ్ళనుందని తెలుస్తోంది. దాదాపు 50 మంది చిత్ర బృందం జార్జియా పయనమవుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో కొన్ని కీలకమైన యుద్ధ సన్నివేశాలన్నీ అక్కడే చిత్రీకరణ జరుపుకోనున్నారు.
కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఒక కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ టబు నటిస్తోందని సమాచారం. స్వాతంత్ర సమయంలో జరిగే ఈ పోరాట సన్నివేశాలను హాలీవుడ్ ఫేమ్ లీ విట్టేకర్ కంపోజ్ చెయ్యటానికి అంగీకరించనున్నారు. నయనతార, తమన్నా కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.