ఎన్టీఆర్ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త !

ఎన్టీఆర్ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త !

Published on Sep 30, 2018 6:52 PM IST

ntr33
క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ శరవేగంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోన్న విషయం తెలిసిందే.. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం దర్శకుడు క్రిష్ ఈ చిత్రంలో ఓ గొప్ప దర్శకుడి పాత్రను పోషిస్తున్నారు. లెంజెండరీ దర్శకుడైన కేవీ రెడ్డిగారి పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ సన్నివేశాలను రేపటి నుండే షూట్ చేయనున్నారని తెలుస్తోంది.

అయితే క్రిష్ ఇప్పటికే మహానటి చిత్రంలో కేవీ రెడ్డి పాత్రలో కనిపించనప్పటికీ, ఎన్టీఆర్ చిత్రంలో మాత్రం చాలా భావోద్వేగ సన్నివేశాల్లో అరవై సంవత్సరాల వయస్సులో ఉన్న కేవీ రెడ్డిగారి పాత్రను పోషించడం విశేషం. కేవీ రెడ్డిగారి చివరి రోజుల్లో ఎదుర్కొన్న ఆర్ధిక ఇబ్బందులను, అప్పటి పరిస్థితులను ఈ చిత్రంలో చూపించనున్నారు.

ముఖ్యంగా కేవీ రెడ్డిగారు ఎన్టీఆర్ గారు మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా ఈ చిత్రంలో చూపిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చెయ్యడానికి సన్నద్ధం అవుతుంది చిత్రబృందం.

తాజా వార్తలు