శరవేగంగా ఎన్టీఆర్ సినిమా పాటల రికార్డింగ్ !

శరవేగంగా ఎన్టీఆర్ సినిమా పాటల రికార్డింగ్ !

Published on Apr 24, 2018 1:42 PM IST

మొదటిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కలయికలో ఒక చిత్రం రూపొం దుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ఈ నెల 13 నుండి హైదరాబాద్లో మొదలైంది. మొదటగా యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారు. మరోవైపు చిత్ర సంగీత దర్శకుడు తమన్ పాటల రికార్డింగ్ మొదలుపెట్టారు.

ముంబైలోని ఒక ప్రైవేట్ స్టూడియోలో ఈ రికార్డింగ్ జరుగుతోంది. ఆడియో ఆల్బమ్ చాలా బాగా వస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది తమన్ ‘తొలిప్రేమ, భాగమతి, ఛల్ మోహన్ రంగ’ వంటి పలు హిట్ ఆల్బమ్స్ ను అందించిన సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే ఎన్టీఆర్ కు జోడీగా నటించనుంది.

తాజా వార్తలు