‘రన్ రాజా రన్’ ఫెమ్ సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇక ఈచిత్రంలో ప్రభాస్ పాత్ర ఫై ఆసక్తికర విషయాలు వెలుబడుతున్నాయి. ఈచిత్రంలో ఆయన అంతర్జాతీయ వజ్రాల దొంగగా నటిస్తున్నారని ఆయన కోసం ఇంటర్ పోల్ అధికారులు తీవ్రంగా గాలిస్తుంటారని ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చిత్రానికి హైలైట్ కానున్నాయని వార్తలు వస్తున్నాయి.
మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.


