తలపతి 63 కోసం 16మంది కొత్తవారు !

Published on Jan 2, 2019 2:36 pm IST

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించనున్న 63వ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ నెల మూడవ వారంలో ఈ చిత్రం యొక్క షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే ఈ చిత్రం ఉమెన్ సాకర్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సమాచారం. కాగా ఈ చిత్రంలో విజయ్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడు. అందుకోసం ఆయన ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. యువ దర్శకుడు అట్లీ రూపొందించనున్న ఈ చిత్రంలో స్పోర్ట్స్ టీం కోసం 16మంది కొత్త అమ్మాయిలను తీసుకుంటున్నారట.

ఎఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈచిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక నటించనుంది. దాదాపుగా 10సంవత్సరాల తరువాత నయన్ , విజయ్ తో జత కడుతుంది. భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదలకానుంది. ఇక ‘తుపాకి , తెరి ,మెర్సల్’ చిత్రాల తరువాత అట్లీ -విజయ్ కలయికలో వస్తున్న ఈచిత్రం ఫై ఇప్పటినుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సంబంధిత సమాచారం :

X
More