వరుణ్ కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా ?

వరుణ్ కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా ?

Published on Oct 28, 2018 10:53 PM IST

Varun Tej

వరుస విజయాలతో కొనసాగుతున్న మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘ఎఫ్ 2’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంతో పాటు వరుణ్ ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘అంతరిక్షం’ అనే చిత్రంలో నటించాడు. షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటున్న ఈచిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఇప్పుడు తాజాగా వరుణ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు సాగర్ చంద్ర చెప్పిన కథ బాగా నచ్చి వెంటనే సినిమాకు ఒకే చెప్పాడట. బడా నిర్మాణ సంస్థ ఈచిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం యొక్క వివరాలు అధికారికంగా వెలుబడే అవకాశాలు వున్నాయి.

తాజా వార్తలు