ఆసుపత్రిలో విజయ్ కాంత్.. ఇంకో రెండు రోజులు

Published on May 19, 2021 6:02 pm IST

ప్రముఖ కోలీవుడ్ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు తెల్లవారు జామున శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే అన్నట్టు తెలుస్తోంది. చాన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న విజయ్ కాంత్ గత ఏడాది కరోనా బారినపడ్డారు.

అదృష్టవశాత్తూ ఆయన త్వరగానే కొలుకున్నారు. ఆయన సతీమణి సైతం కరోనా బారినపడి కొలుకున్నారు. విజయ్ కాంత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వర్గాలు స్పందిస్తూ రొటీన్ చెకప్ నిమిత్తమే ఆయన ఆసుపత్రిలో చేరరాని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఇంకో రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.
దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
సినిమాల అనంతరం రాజకీయాల్లో చురుగ్గా ఉండిన విజయ్ కాంత్ ఆరోగ్య సమస్యల రీత్యా గత కొన్నేళ్లుగా రాజకీయాలకు కూడ దూరంగా ఉంటున్నారు.

సంబంధిత సమాచారం :