దివంగత నేత, ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి జీవితం ఆధారంగా ఒక సినిమాను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నా సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని గతేడాది ‘ఆనందోబ్రహ్మ’ చిత్రంతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు మహి వి రాఘవ్ డైరెక్ట్ చేయనున్నారు.
అయితే ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రను ప్రముఖ నటుడు మమ్ముట్టి చేయనున్నారని, లేడీ సూపర్ స్టార్ నయనతార కూడ ఇందులో ఒక పాత్రలో నటించనుందని గతంలో బలమైన వార్తలు వినిపించాయి. కానీ దర్శకుడు మాత్రం ఇంకా స్క్రిప్ట్ పనులు పూర్తికాలేదని, అవి అయ్యాకే నటీనటుల ఎంపిక జరుగుతుందని, ఇంకా ఎవరరితోను సంప్రదింపులు జరపలేదని అన్నారట. మరి ఈ బయోపిక్ లో నటించబోయే నటీనటులు ఎవరో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.
ఇకపోతే ఈ చిత్రాన్ని 70ఎమ్.ఎమ్.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మించనున్నారు.


