‘వైఎస్సార్’ బయోపిక్ గురించి లేటెస్ట్ అప్ డేట్ !

‘వైఎస్సార్’ బయోపిక్ గురించి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Oct 6, 2018 1:50 AM IST

Yatra
దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి బయోపిక్ ను ‘యాత్ర’ పేరుతో మహి.వి.రాఘవ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరోక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. వైఎస్. జగన్ పాత్రలో సూర్య లేక కార్తినో నటిస్తున్నారని అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.

తాజా సమాచారం ప్రకారం అసలు యాత్ర సినిమాలో జగన్ పాత్రే లేదని తెలుస్తోంది. ప్రధానంగా వైఎస్సార్ పాదయాత్ర నేపథ్యంలోనే ఈ సినిమా సాగనుందట. అందుకే జగన్ పాత్ర సినిమాలో ఉండదని సమాచారం. కాగా వైఎస్సార్ తండ్రి రాజారెడ్డిగారి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. అలాగే సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ లతో పాటు రంగస్థలం చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అనసూయ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డిలు నిర్మిస్తున్నారు

తాజా వార్తలు