మెగస్టార్ బర్త్ డే ఈ సారి ఘనంగానే ఉండబోతుందిగా..!

Published on Aug 18, 2021 2:00 am IST

మెగస్టార్ చిరంజీవి పుట్టిన రోజు దగ్గరకొచ్చేసింది. ఆగస్ట్ 22న చిరు పుట్టిన రోజు కావడంతో ఆ రోజు ఆయన అభిమానులకు ఫుల్ మీల్స్ దొరకడం గ్యారంటీ అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి నటిస్తున్న సినిమాల నుంచి ఆ రోజు వరుసపెట్టి అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ఆచార్య’ సినిమా నుండి సాంగ్ లేదా ట్రైలర్ లేదా రిలీజ్ డేట్ వచ్చే అవకాశం ఉండగా, మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ సినిమా ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌కి సంబంధించి టైటిల్ లేదా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ‘చిరు 154’కు సంబంధించిన అప్డేట్‌ను కూడా దర్శకుడు బాబీ ఇవ్వబోతున్నాడని, అందుకే చిరంజీవితో బాబీ ఓ ఫోటో షూట్ జరుపుతున్నాడని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి కూడా చిరంజీవి బర్త్ డే కాకుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కాకుండా మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్న తమిళ ‘వేదాళం’ నుంచి కూడా ఏదో ఒక అప్డేట్ వెలువడే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు లేనంతగా ఈ సారి తన సినిమాల వరుస అప్డేట్స్‌తో మెగస్టార్ బర్త్ డే ఘనంగానే జరిగేటట్టు అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :