మహేశ్ బాబు సినిమాకే ‘నో’ చెప్పిన స్టార్ హీరో !

Published on Mar 12, 2019 3:49 pm IST

అనిల్ రావిపూడి తన తరువాత సినిమాను మహేశ్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అప్ డేట్స్ కోసం మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా జూలై నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఓ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ తాను ఆ పాత్రకు నో చెప్పినట్లుగా ఉపేంద్ర తెలిపారు. డేట్స్ కుదరకే తాను ఈ సినిమాకు నో చెప్పానని ఆయన అన్నారు.

ఇక ప్రస్తుతం ఉపేంద్ర సినిమా ఐ లవ్యూ పేరుతో తెలుగులోకి డబ్ అవుతుంది. ఈ కొత్త సినిమా ‘కూడా త్వరలో తెలుగులో రిలీజ్ కానుంది. ఇక మహేశ్ సరసన సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోందని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

More