బడా ఆఫర్ ను వదిలేసిన “ఉప్పెన” దర్శకుడు?

Published on Nov 22, 2020 6:00 pm IST

ఇప్పుడు మన టాలీవుడ్ లో డీసెంట్ బజ్ తో విడుదలకు రెడీగా ఉన్న చిత్రాల్లో వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న “ఉప్పెన” చిత్రం కూడా ఒకటి. బిగ్ స్క్రీన్ విడుదల కోసమే మంచి ఓటిటి ఆఫర్స్ ను వదులుకొన్న ఈ చిత్రం ఇపుడు విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఇద్దరు హీరో హీరోయిన్స్ కూడా తమ నెక్స్ట్ సినిమాలను ఓకే చేసేసి వారి పనుల్లో బిజీగా ఉన్నారు.

అయితే ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబు సన పేరు కూడా టాలీవుడ్ లో అండర్ లైన్ చేసి ఉంది. అందుకే ఈ దర్శకుడికి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అలా వచ్చిన ఓ బడా ఆఫర్ నే ఈ దర్శకుడు వదులుకున్నాడని ఇపుడు తెలుస్తుంది. మన తెలుగులో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలలో సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా ఒకటి.

వారు ఈ దర్శకునికి తమతో సినిమా చెయ్యడానికి 60 లక్షలు ఆఫర్ చేశారట. కానీ దర్శకుడు ఈ భారీ ఆఫర్ ను వదులుకున్నారట. ఎందుకంటే తాను అప్పటికే మైత్రి మూవీ మేకర్స్ వారికి మళ్ళీ ఓకే చేసినట్టు సమాచారం. అయినప్పటికీ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ట్రై చేసినా తాను మైత్రి మూవీ మేకర్స్ కే స్టిక్ అయ్యి ఉన్నాడని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More