బ్లాక్ బస్టర్ టీఆర్పీ అందుకున్న “ఉప్పెన” టీవీ ప్రీమియర్.!

Published on Apr 29, 2021 3:03 pm IST

ఈ ఏడాది మన తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యిన చిత్రాల్లో భారీ హిట్స్ గా నిలిచినా జాబితాలో సెన్సేషనల్ హిట్ “ఉప్పెన” కూడా ఒకటి. దర్శకుడు బుచ్చిబాబు సానా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మరో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ముగ్గురికీ డెబ్యూ చిత్రంగా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలోనే ఏ డెబ్యూ సినిమాకి రాని ఆదరణను రాబట్టుకుంది.

మరి సిల్వర్ స్క్రీన్ పై పెద్ద హిట్ గా నిలిచిన ఈ చిత్రం అంతే స్థాయిలో స్మాల్ స్క్రీన్ పై కూడా అదరగొట్టింది. గత కొన్ని రోజుల కితమే స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చెయ్యగా దానికి 18.5 సాలిడ్ టీఆర్పీ వచ్చింది. దీనితో అక్కడ సిల్వర్ స్క్రీన్ తో పాటుగా స్మాల్ స్క్రీన్ పై కూడా ఉప్పెన బ్లాక్ బస్టర్ అయ్యిందని చెప్పాలి. మరి ఈ విజయంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు దేవిశ్రీ ప్రసాద్ మరో మెయిన్ పిల్లర్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే ఈ హిట్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :