“ఉప్పెన” దర్శకుడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాతలు.!

Published on Mar 26, 2021 8:00 am IST

ఈ ఏడాది తెలుగు బాక్సాఫీస్ దగ్గర విడుదల కాబడిన చిత్రాల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కొద్ది చిత్రాల్లో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “ఉప్పెన” కూడా ఒకటి. ఈ ముగ్గురికీ డెబ్యూ చిత్రం అయినటువంటి ఈ చిత్రం భారీ హైప్ తో విడుదలై అంతే స్థాయి వసూళ్లను తెచ్చిపెట్టింది.

దీనితో నిర్మాతలకు కాసుల పంట అందించిన ఈ చిత్రం విజయాన్ని ఇలాంటి చిత్రాన్ని అందించినందుకు ప్రేమను మైత్రి మూవీ మేకర్స్ వారు ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి లేటెస్ట్ గా నిర్మాతలు దర్శకుడు బుచ్చిబాబుకి ఓ ఖరీదైన గిఫ్ట్ ను ఇచ్చారు.

సుమారు అరవై లక్షలకు పైగా ఖరీదైన మెర్సిడిస్ బెంజ్ జి ఎల్ సి కారును బుచ్చిబాబుకు నిర్మాతలు అందించారు. దీనితో ఆ బహుమతిని అందుకున్న బుచ్చిబాబు తన గురు సుకుమార్ తో తన ఫస్ట్ రైడ్ కి వెళ్లారు. మరి దీనితో పాటుగా మళ్ళీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మరో సినిమా చేయనున్నట్టు కూడా వినికిడి.

సంబంధిత సమాచారం :