ఇప్పుడు మన తెలుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతున్న చిత్రం “ఉప్పెన”. ఈ ఏడాది ఆరంభంలోనే మాస్ మహారాజ్ రవితేజ తన “క్రాక్” తో కంటెంట్ తో హిట్ టాక్ తెచ్చుకోగా అదే బాటలో “ఉప్పెన” కూడా సూపర్బ్ మౌత్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడానికి ప్రధాన కారకులు నిర్మాతలు కాకుండా ఎవరు అంటే అది అది హీరో వైష్ణవ్, హీరోయిన్ కృతి శెట్టి అలాగే దర్శకుడు బుచ్చిబాబు సానా ఫైనల్ గా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.
ఈ నలుగురు కూడా ఈ చిత్రానికి అవుట్ స్టాండింగ్ అవుట్ పుట్ ఇచ్చారు. ప్రతీ ఒక్కరి అంశం కూడా ఈ చిత్రంలో చాలా ప్రభావితంగా కనిపించింది. అందుకే ఈ నలుగురు కూడా ఖచ్చితంగా మూల స్తంభాలు అని చెప్పాలి. మరి ఇంత కీలక పాత్ర పోషించిన ఈ నలుగురు కలిపి ఓ ఫొటోలో కనిపించారు. దీనితో ఈ కాంబో మరోసారి వైరల్ అవుతుంది. ప్రస్తుతం అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి పెర్ఫామెన్స్ ను కనబరుస్తుంది.


