‘ఉప్పెన’.. తెలుగు సినిమాకు ఒక శుభశకునం

‘ఉప్పెన’.. తెలుగు సినిమాకు ఒక శుభశకునం

Published on Feb 15, 2021 9:02 PM IST

Uppena 2

లాక్ డౌన్ తర్వాత విడుదలైన తెలుగు సినిమాల్లో రవితేజ ‘క్రాక్’ సాలిడ్ హిట్ అందుకోగా గత శుక్రవారం విడుదలైన ‘ఉప్పెన’ ఆ ఊపును మరింతగా పెంచింది. ‘క్రాక్’ విషయంలో రవితేజ స్టార్ డమ్, క్రేజ్ పనిచేసింది అనుకుంటే ‘ఉప్పెన’ విషయంలో మాత్రం పూర్తిగా ప్రేక్షకుల ఆసక్తే వర్కవుట్ అయింది. లాక్ డౌన్ అనంతరం థియేట్రికల్ బిజినెస్ ఎలా ఉంటుందో అనే అనుమానం అందరిలోనూ నెలకొంది. ఓటీటీల హవా బాగా పెరిగిన నేపథ్యంలో పూర్వంలో మాదిరి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే అనుమానం ఉండేది.

కానీ ‘ఉప్పెన’ ప్రభావంతో ఆ అనుమానాలన్నీ తుడిచిపెట్టుకునిపోయాయి. ప్రేక్షకులకు ఆసక్తి కలిగించాలే కానీ థియేటర్లలో సినిమాకు బ్రహ్మరథం పడతారని ‘ఉప్పెన’ నిరూపించింది. మొదటి వారాంతంలోనే సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.24.97 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.28.29 కోట్ల షేర్ రాబట్టింది. దీన్నిబట్టి సినిమా బాగుంటే ఎన్ని అడ్డంకులున్నా మంచి థియేట్రికల్ రన్ దొరుకుతుందని సినిమా నిరూపించింది. ప్రేక్షకుల్లో థియేటర్ అనుభూతి పట్ల మక్కువ ఏమాత్రం తగ్గలేదని రుజువైంది. మొత్తంగా లాక్ డౌన్ తర్వాత ‘ఉప్పెన’లాంటి ఈ విజయం తెలుగు పరిశ్రమకు ఒక శుభసూచకం అనుకోవచ్చు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేయగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు