యూరి :ది సర్జికల్ స్ట్రైక్ అక్కడ కూడా అదరగొడుతుంది !

Published on Mar 9, 2019 1:05 pm IST

బాలీవుడ్ హీరో విక్కీ కౌషల్ , యామి గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యూరి : ది సర్జికల్స్ట్రైక్’. 2016 లో భారత సైన్యం పాక్ మిలిటెంట్ల ఫై జరిపిన సర్జికల్ స్ట్రైక్ ను ఆధారంగా చేసుకొని తెరకెక్కింది ఈ చిత్రం. జనవరి 11 న విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ లో ఇప్పటివరకు 240 కోట్ల వసూళ్లను రాబట్టి అల్ టైం బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రాన్ని కర్ణాటక లో కూడా విడుదలచేయగా ఇప్పటివరకు అక్కడ 25 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికి అక్కడ వారాంతంలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది ఈ చిత్రం.

అంతే కాకుండా దంగల్ తరువాత అక్కడ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రం గా రికార్డు సృష్టించింది. ఆదిత్య దార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రోనీ స్క్రివెలా నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More