యూఎస్ లో మన్మధుడు 2 కలెక్షన్స్ ఎలావున్నాయంటే…!

Published on Aug 10, 2019 9:45 am IST

టాలీవుడ్ ఎవర్ చార్మింగ్ హీరో కింగ్ నాగార్జున నిన్న మన్మధుడు 2గా థియేటర్లలో దిగిపోయారు. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన మన్మధుడు 2 కి ప్రేక్షకుల నుండి అలాగే క్రిటిక్స్ నుండి మిశ్రమ స్పందన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా కూడా పర్వాలేదు అనిపించింది. కాగా ఓవర్సీస్ లో ఈ చిత్రానికి అనుకున్నంతగా ఆదరణ దక్కలేదని సమాచారం.

మొత్తం గురువారం యూఎస్ ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ $82,284 గ్రాస్ వసూళ్లు సాధించిందని సమాచారం. ఐతే ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మిగిలిన వారాంతపు శెలవు దినాలలో మన్మధుడు 2 మూవీ వసూళ్లు పెరిగే అవకాశం కలదు అంటున్నారు. ఇక శుక్రవారం సాయంత్రం 5:30గంటల వరకు అందిన సమాచారం ప్రకారం మన్మధుడు 2 $23,766 గ్రాస్ వసూళ్లతో ఇప్పటివరకు అక్కడ మొత్తం $123,236 గ్రాస్ వసూళ్లు సాధించిందని తెలుస్తుంది. మూవీపై మిశ్రమ స్పందన ఉన్న నేపథ్యంలో మన్మధుడు 2 మూవీ ఏమాత్రం వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :