పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశిఖన్నా అలాగే శ్రీలీల హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పట్ల మంచి బజ్ నెలకొన్న నేపథ్యంలో మేకర్స్ రిలీజ్ ని ప్రీ పోన్ కూడా చేసారు. అయితే ఈ సినిమా కథ విషయంలో అభిమానులుకి కొత్త టెన్షన్ పట్టుకుంది.
ఇన్ని రోజులు రీమేక్ కాదు అని హరీష్ చెప్పారు. కానీ బుక్ మై షోలో సినాప్స్ (కథ లైన్) చర్చకు దారి తీసింది. ఇది విజయ్ సినిమా థెరి తరహా లోనే కనిపించడం టెన్షన్ కి దారి తీసింది. అయితే బుక్ మై షోలో ఇది వరకే పలు సినిమాలకి ముందే లైన్స్ యాడ్ చేయడం జరుగుతుంది తర్వాత మార్చడం కూడా అవుతుంది. కానీ ఈ సినిమా లైన్ కూడా మారితే ఓకే కానీ లేదంటే అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.



