పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇద్దరు హీరోయిన్స్ శ్రీలీల మరియు రాశిఖన్నా కాంబినేషన్ లో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాకి వాటిని మరింత ఎక్కువ చేసే విధంగా మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇక రీసెంట్ గానే ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్ పూర్తి చేసుకొని రిలీజ్ కి దగ్గరవుతున్న ఈ సినిమా యూఎస్ లోని నార్త్ అమెరికాలో ఆల్రెడీ హవా స్టార్ట్ చేసింది.
బుకింగ్స్ మొదలైన కొన్ని గంటల్లోనే 50 వేల డాలర్లుకి పైగా గ్రాస్ ని ప్రీమియర్ బుకింగ్స్ లో అందుకుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే కాగా మున్ముందు వచ్చే సాలిడ్ కంటెంట్ తో మాత్రం ఈ సినిమా మరింత గట్టి నంబర్స్ సెట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, థమన్ లు సంగీతం అందిస్తున్నారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మార్చ్ 19న సినిమా గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది.


