బుక్ మై షోలో “ఉస్తాద్” ఊచకోత.. భారీ బుకింగ్స్ తో పవర్ స్టార్ ర్యాంపేజ్!

బుక్ మై షోలో “ఉస్తాద్” ఊచకోత.. భారీ బుకింగ్స్ తో పవర్ స్టార్ ర్యాంపేజ్!

Published on Mar 20, 2026 10:17 AM IST

ustaad-bhagat-singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. మంచి బజ్ నడుమ విడుదల అయ్యిన ఈ సినిమాకి ఆడియెన్స్ నుంచి మంచి మౌత్ టాక్ నే పడింది. అయితే బుకింగ్స్ పరంగా ఈ సినిమా భారీ బుకింగ్స్ ని నమోదు చేస్తూ దూసుకెళ్తుంది.

కేవలం ఈ 3 రోజుల్లోనే 6 లక్షల 44 వేలకి పైగా టికెట్స్ ని ఈ సినిమా సేల్ చేసుకొని దుమ్ము లేపింది. మార్చ్ 17న లక్ష 16 వేలకి పైగా టికెట్స్, మార్చ్ 18 న 2 లక్షల 17 వేలు అలాగే రిలీజ్ రోజు మార్చ్ 19 న 3 లక్షల 11 వేలకి పైగా టికెట్స్ ని ఈ సినిమా సేల్ చేసుకుంది. ఇలా పవర్ స్టార్ అయితే తన మేనియా కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు