విడుదలకు సిద్దమయిన ‘ఉత్తమ విలన్’

విడుదలకు సిద్దమయిన ‘ఉత్తమ విలన్’

Published on Nov 15, 2014 10:30 AM IST

1416015667-1041
తెయ్యమ్‌ కళాకారుడిగా, ప్రజెంట్ సూపర్ స్టార్ గా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘ఉత్తమ విలన్’. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను 2015లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నటుడు రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా కుమార్, ఆండ్రియాలు హీరోయిన్లుగా నటించారు. ‘ఉత్తమ విలన్’ కథ, స్క్రీన్ ప్లే, మాటలను కమల్ అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాలచందర్, కె.విశ్వనాధ్ వంటి ప్రముఖ దర్శకులు నటించారు. జిబ్రాన్ సంగీతం అందించారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, లింగుస్వామి తిరుపతి బ్రదర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి.

కమల్ నటించిన మరో రెండు సినిమాలు ‘విశ్వరూపం 2’, ‘దృశ్యం’ రీమేక్ ‘పాపనాశనం’ సినిమాలు కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్నాయి. మొదట ‘పాపనాశనం’ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు