‘యూటర్న్’ అక్కడ కూడా బాగానే రాబడుతుంది !

‘యూటర్న్’ అక్కడ కూడా బాగానే రాబడుతుంది !

Published on Sep 18, 2018 3:05 PM IST

ప్రముఖ హీరోయిన్ సమంత అక్కినేని ప్రధాన పాత్రలో పవన్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘యూటర్న్’. ఇటీవల విడుదలైన ఈచిత్రం మంచి మౌత్ టాక్ తో బ్లాక్ బ్లాస్టర్ విజయం వైపు దూసుకుపోతుంది. కన్నడలో సూపర్ హిట్ సాధించిన యూటర్న్ చిత్రానికి రీమేక్ గా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.16కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

ఇక ఈ చిత్రం తమిళనాడులో మంచి వసూళ్లను రాబడుతుంది. దాదాపు అక్కడ 200స్క్రీన్ లలో విడుదలైన ఈచిత్రం ఇప్పటివరకు రూ.3.65కోట్ల వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్లో ఈచిత్రం మంచి లాభాలను ఖాతాలో వేసుకోనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు