లేటెస్ట్..సంక్రాంతికి యంగ్ హీరోతో యూవి క్రియేషన్స్.!

లేటెస్ట్..సంక్రాంతికి యంగ్ హీరోతో యూవి క్రియేషన్స్.!

Published on Dec 9, 2022 10:37 AM IST

ఆల్రెడీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మన టాలీవుడ్ నుంచి పలు భారీ సినిమాలు అందులోని మన సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ల చిత్రాలు ఆల్రెడీ ఫిక్స్ కాగా కొన్ని తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి. పైగా వీటిపై కూడా మంచి అంచనాలు నెలకొనగా వీటితో సంక్రాంతి బరిలో మరో రెండు చిత్రాలు యంగ్ హీరోలు నటిస్తున్నవి వస్తాయని బజ్ కూడా ఉంది.

ఇక ఇప్పుడు అయితే వీటిలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న చిత్రం “కళ్యాణం కమనీయం” అనే చిత్రం డేట్ ఫిక్స్ చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే ఈ చిత్రం జనవరి 14న రిలీజ్ కానుండగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మేకర్స్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాలకి రీలిజ్ చేయనున్నారు. మరి ఈ చిత్రాన్ని అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే మంచి కాన్ఫిడెంట్ తో ఈ చిత్రాన్ని సంక్రాంతికి వారు లాక్ చేసినట్టుగా తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు