రామ్ చరణ్ రూ.50 కోట్లు ఇస్తానని మాట తప్పాడట

Published on Sep 22, 2019 2:41 pm IST

‘సైరా’ చిత్రంపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యుల నిరసన తీవ్ర రూపం దాల్చింది. సినిమా మొదట్లో నిర్మాత రామ్ చరణ్ ఉయ్యాలవాడ వారసులమైన తమ వద్ద నుండి కథను, అనేక ఇతర వివరాలను తీసుకుని 23 మంది కుటుంబ సభ్యులకు రూ.50 కోట్లు ఇస్తామని చెప్పారని, ఆ తర్వాత అగ్రిమెంట్ కూడా ఇచ్చారని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ నందు చిరంజీవి, చరణ్ మీద పిర్యాదు చేశారు.

గతంలో చిరంజీవి ఇంటి ముందు, ఆఫీస్ ముందు ధర్నాకు దిగితే తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. అంతేకాదు ఈరోజు సాయంత్రం జరగనున్న చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను అడ్డుకుంటామని కూడా అంటున్నారు. మరి ఈ వివాదాన్ని చరణ్ అండ్ టీమ్ ఎలా ముగిస్తారో చూడాలి.

మరోవైపు వేడుకకు పవన్ కళ్యాణ్, ఇతర సినీ ప్రముఖులు హాజరుకానుండటంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా ఐదు భాషల్లో విడుదలకానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు, అభిమానుల్లో భారీస్థాయి అంచనలున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More