వినాయక్ రవితేజతో ఫిక్స్ అయినట్లేనా ?

వినాయక్ రవితేజతో ఫిక్స్ అయినట్లేనా ?

Published on Mar 17, 2019 11:26 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ ఓ సినిమాని నిర్మించటానికి ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తోన్నప్పటికీ ఆ సినిమాకి స్క్రిప్ట్ మాత్రం సెట్ కావట్లేదు. కాగా తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా ఇప్పట్లో సాధ్యం కాదని తెలుస్తోంది.

ఎందుకంటే వినాయక్ తన కథను రవితేజకు వినిపించారట. రవితేజకు కూడా కథ బాగా నచ్చిందట. కాగా వీరి సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇక గతంలో వీరి కాంబినేషన్ లో ‘కృష్ణ’ సూపర్ హిట్ చిత్రం వచ్చింది. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు