మంచు మనోజ్ చేతుల మీదుగా ‘వానర’ టీజర్ విడుదల

మంచు మనోజ్ చేతుల మీదుగా ‘వానర’ టీజర్ విడుదల

Published on Nov 27, 2025 10:00 AM IST

vanara

అవినాశ్ తిరువీధుల హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన ‘వానర’ సినిమా టీజర్ ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విడుదల చేశారు. సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై శంతను పత్తి సమర్పణలో తెరకెక్కిన ఈ మైథలాజికల్ రూరల్ డ్రామాలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా, నందు విలన్ గా నటిస్తున్నారు.

టీజర్ విడుదల సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారని, హీరోగా, దర్శకుడిగా అవినాశ్ పడ్డ కష్టం టీజర్లో స్పష్టంగా కనిపిస్తోందని ప్రశంసించారు. తన తండ్రి కోరిక మేరకే నటుడిని అయ్యానని తెలిపిన అవినాశ్.. ఈ చిత్రానికి హీరో విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్ అందించారని, కిరణ్ అబ్బవరం గైడ్ చేశారని కృతజ్ఞతలు తెలిపారు.

రావణుడి లాంటి విలన్ హీరో బైక్ ఎత్తుకెళ్తే.. వానరుడి లాంటి హీరో ఆ బైక్ కోసం ఎంతదాకా వెళ్లాడు, ఎలాంటి యుద్ధం చేశాడనే వైవిధ్యమైన పాయింట్ తో ఈ కథను రూపొందించారు. సాయిమాధవ్ బుర్రా మాటలు, వివేక్ సాగర్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు