ఫైనల్ గా ఓటిటిలోకి వచ్చేసిన ‘వాక్సిన్ వార్’

ఫైనల్ గా ఓటిటిలోకి వచ్చేసిన ‘వాక్సిన్ వార్’

Published on Nov 24, 2023 11:00 PM IST


ఇటీవల ది కాశ్మీర్ ఫైల్స్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ది వాక్సిన్ వార్. ఈ మూవీ సెప్టెంబర్ 28, 2023న మంచి అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. నానా పటేకర్, పల్లవి జోషి, రైమా సేన్, అనుపమ్ ఖేర్, గిరికా ఓక్, సప్తమి గౌడ మరియు నివేదిత భట్టాచార్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఫైనల్ గా నేడు ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చింది.

కాగా ఈ మూవీ ప్రస్తుతం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇతర భాషా డబ్బింగ్ వెర్షన్‌ల గురించి మాత్రం ఎటువంటి సమాచారం లేదు. ఐ యామ్ బుద్ధా ప్రొడక్షన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లవి జోషి, ఈ చిత్ర నిర్మాణం కోసం అభిషేక్ అగర్వాల్‌తో కలిసి పనిచేశారు. భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ తయారీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో కరోనా టీకా తయారీలో భారతీయ శాస్త్రవేత్తల బృందం ఎలా కష్టపడ్డారు, మహిళా శాస్త్రవేత్తలు ఎలాంటి పాత్ర పోషించారు అనే అంశాలను ఎంతో హృద్యంగా చూపించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు