ఒకప్పుడు తెలుగు సినిమా దగ్గర ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోస్ లో వడ్డే నవీన్ కి ఉన్న క్రేజ్ వేరు అని చెప్పాలి. తాను సినిమాలు ఆపేసాక ఎంతోమంది తన రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. తెలుగులో సినిమాలు తగ్గించేసాక సోషల్ మీడియా కానీ ఇతర మీడియాలో కానీ కనిపించింది లేదు.
దీనితో తన కోసం యూట్యూబ్ లో ఇంటర్వ్యూ చూసిన తన కామెంట్స్ దర్శనం ఇచ్చేవి. ఈ ఫ్యాన్స్ అందరికీ ఫైనల్ గా సాలిడ్ న్యూస్ వచ్చేసింది. వడ్డే నవీన్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ “ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు” గా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఒక కమల్ తేజ నార్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వడ్డే నవీన్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు.
ఇక ఫస్ట్ లుక్ లో తాను వింటేజ్ లుక్ లో పోలీస్ కానిస్టేబుల్ గా కనిపిస్తున్నారు. దీనితో తన ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మళ్ళీ పాత రోజులు గుర్తుకు రానున్నాయి. ఇక ఈ సినిమాని వడ్డే నవీన్ నే నిర్మాణం వహిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతుంది.


