ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న “దీర్ఘాయుష్మాన్‌భవ” సినిమాలోని “వదిలి వెళ్ళిపోకే” పాట..!

Published on Nov 27, 2021 11:00 am IST

కార్తీక్ రాజు, మిస్తీ చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నోయెల్, ఆమని, పృద్వీ, సత్యం రాజేష్, కాశి విశ్వనాధ్, తాగుబోతు రమేష్, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దీర్ఘాయుష్మాన్ భవ’. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ గారు చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో మళ్ళీ యముడి పాత్రలో నటించారు.
పూర్ణానంద మిన్నకూరి ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అందించగా, డాక్టర్ ఎంవీకే రెడ్డి సమర్పణలో ప్రతిమ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

అయితే ఈ సినిమాలోని ‘వదిలి వెళ్ళిపోకే’ అనే పాట యూట్యూబ్ లో విడుదల కాగా ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సోసియో ఫాంటసీ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మలహర్ భట్ జోషి ఛాయాగ్రహణం అందించగా, వినోద్ యాజమాన్య సంగీతం సమకూరుస్తున్నారు. కిషోర్ మద్దాలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :