ఈసారి మాస్ మీల్స్ తో వస్తున్న వైష్ణవ్ తేజ్..కొత్త ప్రాజెక్ట్ అనౌన్సమెంట్!

Published on Jun 22, 2022 11:37 am IST

తన ఫస్ట్ సినిమా తోనే 100 కోట్ల గ్రాస్ ను అందుకున్న ఏకైక ఇండియన్ సినిమా హీరోగా మెగా యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ నిలిచాడు. మరి ఈ చిత్రం తర్వాత కూడా కొత్త సబ్జెక్టు లనే ఎంచుకుంటూ వెళ్తున్న వైష్ణవ్ తేజ్ ఇప్పుడు పూర్తి మాస్ ప్రాజెక్ట్ ని చేయడానికి సిద్ధం అయ్యాడు.

తన కెరీర్ లో నాల్గవ సినిమాగా దర్శకుడు శ్రీకాంత్ ఎం రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన అనౌన్సమెంట్ టీజర్ మాత్రం సాలిడ్ గా ఉందని చెప్పాలి.

వైష్ణవ్ తేజ్ కెరీర్ లో ఫస్ట్ పవర్ ఫుల్ మాస్ సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ పుష్కలంగా పెట్టినట్టుగా బ్యాక్గ్రౌండ్ డైలాగ్స్ వింటుంటే అర్ధం అవుతుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :