‘అప్పట్లో ఒకడుండేవాడు’ దర్శకుడితో తేజ్ త‌మ్ముడు ?

‘అప్పట్లో ఒకడుండేవాడు’ దర్శకుడితో తేజ్ త‌మ్ముడు ?

Published on Jun 27, 2018 10:52 PM IST

మరో మెగా మేనల్లుడి సినీరంగ ప్రవేశానికి ముహూర్తం కుదిరిందని తెలుస్తోంది. సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్‌ తేజ్ హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వడానికి రెడీ అయిపోయాడు. తాజాగా మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయ‌న హీరోగా నటించిన ‘విజేత’ చిత్రం వ‌చ్చే నెల‌లో గ్రాండ్ గా విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది. ఐతే ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్‌ కూడా ఎప్పటి నుంచో హీరో అవ్వాలని అనుకుంటున్నాడు. ఆ క్రమంలోనే కొన్ని సబ్జెక్ట్ లు కూడా వినడం జరిగింది.

కాగా ‘నేల టిక్కెట్టు’ నిర్మాత రామ్ తాళ్లూరి వైష్ణ‌వ్‌ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. రామ్ తాళ్లూరి గతంలోనే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ దర్శకుడు సాగర్‌ కె. చంద్రతో సినిమా చేయాలని నిర్ణయించుకుని ఉన్నారు. దాంతో వైష్ణ‌వ్‌ తేజ్, సాగర్‌ కె. చంద్ర కాంబినేషన్ లో సినిమా చెయ్యటానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైష్ణ‌వ్ సినిమా పూర్త‌య్యాక‌ సాయిధ‌ర‌మ్ తేజ్ తోనూ రామ్ తాళ్లూరి ఓ సినిమా నిర్మించనున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు