పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం షూటింగ్ ప్రారంభం!

Published on Aug 10, 2021 4:54 pm IST


పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, కేతీక శర్మ హీరోయిన్ గా గిరీషయ దర్శకత్వం లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడగా, ఇందుకు సంబంధించిన షూటింగ్ తాజాగా ప్రారంభం అయింది. శ్రీ వెంకటేష సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఉప్పెన చిత్రం తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన వైష్ణవ్ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తన మూడవ చిత్రం షూటింగ్ ప్రారంభం కావడం తో ప్రేక్షకుల, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరొక అప్డేట్ రావడం తో సినిమా విడుదల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :