“వకీల్ సాబ్” వరల్డ్ ప్రీమియర్ కి గెట్ రెడీ.!

Published on Jul 4, 2021 10:39 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ సాలిడ్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదల అయ్యి సాలిడ్ ఓపెనింగ్స్ ని ఈ కరోనా కాలంలో కూడా రాబట్టింది. మరి థియేటర్స్ లో రెండు వారాలు పాటు మాత్రమే నిలిచిన ఈ చిత్రం ఆ కొన్ని రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ కి కూడా వచ్చేసింది.

మరి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటి టీవీలోకి రావడానికి సిద్ధం గా ఉన్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఈ చిత్రం తాలూకా శాటిలైట్ హక్కులను దక్కించుకున్న జీ తెలుగు వారు ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ను టెలికాస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మరి అతి త్వరలోనే అని ప్రకటించారు.

కానీ డేట్ ఎప్పుడు అన్న దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ చిత్రాల్లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా అనన్య నాగళ్ళ, నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటించారు. అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి నిర్మాణం వహించారు. మరి ఈ బిగ్గెస్ట్ ప్రీమియర్ డేట్ ఎప్పుడో చూడాలి.

సంబంధిత సమాచారం :