ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. అయితే ఇది పవన్ కం బ్యాక్ సినిమా కావడంతో అభిమానుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. అలాగే ఇంకొన్ని రోజుల్లో టీజర్ రానుంది అనగా ఆ సందడి వాతావరణం కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఉంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఆన్ సెట్స్ ఫొటోలే చాలానే బయటకు వచ్చేసాయి. అలా లేటెస్ట్ గా ఈ చిత్రంలోని క్లైమాక్స్ సాలిడ్ ఫైట్ సీక్వెన్స్ ను విలన్ రోల్స్ చేసే ప్రముఖ నటుడు దేవ్ గిల్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. అంతే అక్కడ నుంచి ఈ క్లైమాక్స్ షూట్ ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.
దీనిని బట్టి సినిమాలో చాలానే మార్పులు చేర్పులు చేసారని అర్ధం అవుతుంది, మరి మేకర్స్ ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించారో తెలియాలి అంటే టీజర్ వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా నివేతా థామస్ అలాగే అంజలిలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


