ఓవర్సీస్ లో సూపర్ స్ట్రాంగ్ గా “వకీల్ సాబ్”.!

Published on Apr 11, 2021 9:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఇపుడు ఆలోవర్ గా భారీ రెస్పాన్స్ వస్తుంది. అలా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వకీల్ సాబ్ బ్యాటింగ్ ఓవర్సీస్ లో భారీ ఎత్తునే ఉంది.

ఒక్క యూఎస్ లోనే కాకుండా ఆస్ట్రేలియా లో కూడా సాలిడ్ వసూళ్లు ఈ చిత్రం రాబడుతుంది. మరి ఇపుడు యూఎస్ లో ఈ చిత్రం నిన్న శనివారం వసూళ్లతో కలిపి 6 లక్షల డాలర్ల మార్కును టచ్ చేసినట్టుగా క్లారిటీ వచ్చింది. దీనితో ఈ చిత్రం అనుకున్న టార్గెట్ ను సింపుల్ గానే క్రాస్ చేసే అవకాశం ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి మాత్రం ఈ కరోనా స్కేర్ లో కూడా పవన్ సినిమా స్ట్రాంగ్ గా నిలబడుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నివేత, అంజలి మరియు అనన్య నటనలకు అద్భుత స్పందన వస్తుండగా థమన్ పై కూడా ప్రశంసల జల్లు కురుస్తుంది. ఇక మోస్ట్ అవైటెడ్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :