“వకీల్ సాబ్” రచ్చ గట్టిగానే ఉండేలా ఉంది.!

Published on Mar 25, 2021 6:05 pm IST

ఆల్ మోస్ట్ మూడేళ్లు దాటేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చి. మరి ఎట్టకేలకు మళ్ళీ అందరి స్టార్ హీరోల లానే పవన్ కం బ్యాక్ చిత్రం అయిన “వకీల్ సాబ్” విడుదలకు రెడీగా ఉంది. అయితే ఈ చిత్రం పవన్ కం బ్యాక్ దే అయినప్పటికీ మధ్యలో పరిస్థితులు గట్టిగానే మారిపోయాయి. లాక్ డౌన్ రావడం షూట్ డిలే కావడం పైగా మధ్యలో అభిమానుల వల్లే హైప్ తగ్గిపోవడం వంటిది జరిగింది.

అలాగే ప్రమోషన్స్ కూడా సరిగ్గా జరగడం లేదు అన్నది కూడా గట్టిగానే వినిపించింది. కానీ ఇప్పుడు విడుదలకు టైం దగ్గర పడుతుండడంతో వకీల్ సాబ్ మ్యానియా థియేటర్స్ లో గట్టిగానే ఉండనున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా మూడు రోజులకు సోల్డ్ అవుట్ అయ్యాయని అభిమానులు చెప్తున్నారు.

మరి లేటెస్ట్ గా వరల్డ్ లోనే బిగ్గెస్ట్ స్క్రీన్ కలిగిన మెల్బోర్న్ ఐమాక్స్ బుకింగ్స్ కూడా యిట్టె అయ్యిపోయాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మాత్రం పవర్ స్టార్ హవా చివరి నిమిషంలో గట్టిగానే విట్నెస్ చెయ్యడం గ్యారంటీ అనేలా ఉందని చెప్పాలి. మరి వచ్చే ఏప్రిల్ 9 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :