పవన్ కళ్యాణ్ లేకుండానే పని కానిచ్చేస్తున్నారు

Published on Sep 22, 2020 2:08 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. లాక్ డౌన్ ముందు దాదాపుగా పూర్తైన చిత్రం కొంత షూట్ మిగిలి ఉండగా నిలిచిపోయింది. మళ్లీ సుమారు 5 నెలల తర్వాత ఈరోజే చిత్రీకరణను రీస్టార్ట్ చేశారు. అయితే ఈ చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం లేదట. మిగతా నటీనటుల మీద కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. నవంబర్ నెల మధ్యలో లేదా ఆఖరి వారంలో పవన్ సెట్స్ మీదకి వస్తారట. ఈలోపు మిగతా చిత్రీకరణ ముగించి పవన్ కోసం సిద్దంగా ఉంటారట. పవన్ షూట్లో జాయిన్ అయిన తరువాత ఏకధాటిగా 20 నుండి 25 రోజుల వరకు షూటింగ్ చేస్తే సినిమా పూర్తవుతుందని తెలుస్తోంది.

ఇక మిగిలిందల్లా ఫ్లాష్ బాక్ చిత్రీకరణే. ఇందులో శృతి హాసన్ కూడ పాల్గొననున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు బ్యానర్ పై రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. మే నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. ‘అజ్ఞాతవాసి’ తరువాత పవన్ చేస్తున్న చిత్రం కావడంతో అభిమానులు సినిమా ఫలితంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అంచనాలకు తగ్గట్టే సినిమాకు ఓటీటీ ఆఫర్ భారీగా వచ్చినట్టు సమాచారం. అయితే నిర్మాత దిల్ రాజు చిత్రాన్ని నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకులకు అందివ్వనున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వం ఒకటి, హరీష్ శంకర్ సినిమాలు చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

More