కొనసాగుతున్న “వకీల్ సాబ్” టీజర్ మ్యానియా.!

Published on Jan 19, 2021 9:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. పవన్ కం బ్యాక్ సినిమా కావడంతో ఇది రీమేక్ అయ్యినప్పటికీ కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రానికి సంబంధించి మోస్ట్ అవైటెడ్ టీజర్ ను మేకర్స్ ఇటీవలే సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మరి అక్కడ నుంచి సాలిడ్ రెస్పాన్స్ ను అందుకున్న ఈ టీజర్ ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ గా నిలబడడం విశేషం. వ్యూస్ పరంగా పేలవమైన రెస్పాన్స్ నే అందుకున్నా లైక్స్ మరియు ట్రెండింగ్ లో మాత్రం పవన్ కెరీర్ లోనే అత్యధికంగా నిలిచింది. గత 90 గంటలకు పైగానే యూట్యూబ్ లో ఈ టీజర్ నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ వస్తుంది.

అంతే కాకుండా మన టాలీవుడ్ లోనే మోస్ట్ లైక్డ్ సెకండ్ టీజర్ గా కూడా నిలిచింది. సరైన ప్లానింగ్ లేకుండానే వకీల్ సాబ్ టీజర్ ఈ ఫీట్ ను నెలకొల్పింది. మరి ఒక స్ట్రెయిట్ సినిమాకు అయితే ఖచ్చితంగా మరింత రెస్పాన్స్ వచ్చి ఉండేది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :