టైం ఫిక్స్ చేసుకున్న “వకీల్ సాబ్”..!

Published on Oct 28, 2020 10:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చాలా కలం విరామం తర్వాత స్టార్ట్ చేసిన చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని అప్డేట్స్ తోనే సరిపెట్టుకున్న పవన్ అభిమానులు లాక్ డౌన్ మూలాన ఇంకా చాలానే మిస్సయ్యారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా కాస్త బ్యాలన్స్ షూట్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో షూటింగ్స్ తిరిగి మొదలు కావడంతో వకీల్ సాబ్ యూనిట్ కూడా మొదలు పెట్టారు. ముందు పవన్ లేని షాట్స్ ను తీసేసి పవన్ రాక కోసం ఎదురు చూసారు. అయితే ఇప్పుడు పవన్ ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది.

ఈ నవంబర్ 1 నుంచి షూట్ లో పాల్గొనేందుకు ఈ వకీల్ సాబ్ టైం ను ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ నుంచి పవన్ పై మిగిలి ఉన్న కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ షూట్ లోనే శృతి హాసన్ కూడా పాల్గొననుందా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More