‘వకీల్ సాబ్’ ట్రైలర్ :’పింక్’ సినిమాకు సిన్సియర్ రీమేక్

Published on Mar 29, 2021 7:40 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వకీల్ సాబ్’ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. అభిమానులంతా థియేటర్లకు పోటెత్తారు. ఇన్నేళ్ల తర్వాత వెండితెర మీద తమ అభిమాన హీరోను చూసి మురిసిపోయారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే సినిమా కొన్ని అంచనాలను మార్చివేసిందనే అనాలి. టీజర్ ను కొలిచి కొలిచి పవర్ ప్యాక్డ్ అన్నట్టు కట్ చేసిన టీమ్ ట్రైలర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు పాటించినట్టే కనిపిస్తోంది.

టీజర్, పాటలు చూశాక పవన్ టీమ్ ‘పింక్’ సినిమా అసలు స్ఫూర్తిని పక్కనపెట్టేసి పూర్తిగా పవన్ మేనియా మీద వెళుతోందని, పవన్ ను ఎలివేట్ చేసే ప్రయత్నాలే ఎక్కువ కనిపిస్తున్నాయని, వేణు శ్రీరామ్ చేస్తున్నది అసలు రీమేక్ సినిమానా లేకపోతే రీమేక్ పేరుతో కథ మొత్తాన్ని మార్చివేశారా అనే ప్రశ్నలు తలెత్తాయి. వాటన్నింటికీ సమాధానం అనేలా ఉంది ట్రైలర్. ఎక్కడా నెల విడిచి సాము చేసినట్టు లేదు. పవన్ ఎలివేషన్స్ మీద కాకుండా కథ మీదే దృష్టి పెట్టినట్టు అనిపిస్తోంది. టీజర్లో పేలిన పంచ్ డైలాగ్స్ సైతం ఇందులో లేవు.

కేవలం ‘బద్రి’ సినిమాను గుర్తుచేస్తూ ప్రకాష్ రాజ్ పేరును నందా అనేదే తప్ప అవసరం లేకపోయినా హీరోయిక్ పంచెస్ వేద్దామనే అత్యుత్సాహం కనబడలేదు. సినిమాలో మెట్రో ట్రైన్ ఫైట్ మాత్రమే ఉన్నట్టుంది. ట్రైలర్లో కూడ అదే కనబడింది తప్ప వేరొకటి లేదు. కోర్ట్ రోఫామ్ ఎపిసోడ్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నారు. చూస్తుంటే సినిమా ‘పింక్’ సినిమాకు సిన్సియర్ రీమేక్ చేశారు అనేలా ఉంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :