“వకీల్ సాబ్” కు అక్కడ నష్టాలే ఇక..!

Published on Apr 22, 2021 7:06 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ అండ్ మాస్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. భారీ అంచనాల నడుమ ఈ నెల 9న ఈ చిత్రం విడుదల అయ్యింది. అయితే అన్ని చోట్లా సాలిడ్ టాక్ తో పాటు భారీ ఓపెనింగ్స్ ను కూడా ఈ చిత్రం సాధించింది. మరి కరోనా ప్రభావమో ఏమో కానీ మొదట్లో దానిని లెక్క చేయకుండా సినిమా చూసినా ఫైనల్ గా మాత్రం కొన్ని చోట్ల నష్టాలు తప్పేలా లేవని తెలుస్తోంది.

వాటిలో ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో వకీల్ సాబ్ కి గట్టి దెబ్బే పడేలా కనిపిస్తుంది. యూఎస్ లో 1 మిలియన్ కి పైగా బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు అంత మొత్తాన్ని వెనక్కి రాబట్టడానికి స్ట్రగుల్ అవుతుంది. ప్రస్తుతానికి అక్కడ 7 లక్షల 50 వేల డాలర్లు మాత్రమే రాబట్టినట్టు తెలుస్తోంది. సో ఇక నుంచి 1 మిలియన్ కి పైగా అంటే కష్టమే అని చెప్పాలి. దీనితో ఈ చిత్రానికి అక్కడ నష్టాలు తప్పలేదు.. ఇక ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించారు. అలాగే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :