“వకీల్ సాబ్” పనులు జరుగుతున్నాయట.!

Published on Aug 12, 2020 1:35 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” నుంచి ఒక్క అప్డేట్ అయినా రావాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే చాలా కాలం ఎదురు చూపులు తర్వాత వచ్చే సెప్టెంబర్ 2 న పవన్ పుట్టినరోజు కావడంతో ఆరోజు వకీల్ సాబ్ టీజర్ ను విడుదల చెయ్యాలని వకీల్ సాబ్ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ టీజర్ కు సంబంధించి మరింత బజ్ వినిపిస్తుంది.

ప్రస్తుతం ఈ చిత్రం టీజర్ కట్ పనులు జరుగుతున్నాయట. అలాగే ఈ టీజర్ కట్ కు ఎడిటర్ ప్రవీణ్ పూడి పని చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎప్పటి నుంచో పవన్ ఫ్యాన్స్ ఈ టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఆ టీజర్ ఎలా ఉందో తెలియాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు.అలాగే నివేతా థామస్, అంజలి లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :

More