
వక్కంతం వంశీ – ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలతో కెరీర్లో బిజీబిజీగా ఉన్న రైటర్స్ లో ఒకరు. గత సంవత్సరం ‘రేసు గుర్రం’ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలిసి చేసిన సినిమా ‘టెంపర్’. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా గురించి వక్కంతం వంశీ మాట్లాడుతూ ‘ టెంపర్ సినిమాలోఎన్.టి.ఆర్ కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ని ఈ సినిమాలో చూస్తారు. ఎన్.టి.ఆర్ లోని పూర్తి టాలెంట్ ని ఓ డైరెక్టర్ వాడుకుంటే వచ్చే సినిమానే టెంపర్. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ చెప్పే డైలాగ్స్ నందమూరి ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తాయి. ఎన్.టి.ఆర్ ఇప్పటి వరకూ కనపడని సిక్స్ ప్యాక్ లుక్, స్టైలిష్ అవతార్ లో, డిఫరెంట్ మాడ్యులేషన్ లో తన ట్రేడ్ మార్క్ డైలాగ్స్ తో ఈ సినిమాలో కనిపిస్తాడని’ అన్నాడు. వక్కంతం వంశీ పూరి జగన్నాధ్ మహేష్ బాబుతో చేయనున్న సినిమాకి కూడా కథని అందించాడని సమాచారం.

