రాధే శ్యామ్ నుండి వాలంటైన్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!

Published on Feb 14, 2022 12:01 am IST

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న సరికొత్త చిత్రం రాధే శ్యామ్. మార్చ్ 11, 2022 కి ఈ చిత్రం ను భారీ గా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి వాలెంటైన్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14 వ తేదీన మధ్యాహ్నం 1:43 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ప్రభాస్ చిత్రం నుండి మరొక అప్డేట్ రావడం తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :