లాక్ డౌన్ కారణంగా దర్శకులకు కావాల్సినంత సమయం దొరికింది. దీంతో తమ క్రియేటివ్ ఆలోచనలకు పదును పెడుతున్నారు చాలామంది దర్శకులు. కొత్త కథలను డెవెలెప్ చేస్తూ తమ హీరోలను ఒప్పించాలనుకుంటున్నారు. వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నా ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం దర్శకుడు వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే పూర్తి చేసిన కథను త్వరలోనే చరణ్ కి కథ చెప్పి ఒప్పించాలని వంశీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ స్టార్ డైరెక్టర్ కి చరణ్ యస్ చెబుతాడా.. చూడాలి.
కాగా ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా క్రేజీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వంశీ పైడిపల్లి సినిమాని రూపొందించనున్నారట. ఇక వంశీ, చరణ్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి. పైగా వంశీ లాస్ట్ మూవీ ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. మరి ఈ సారి వంశీ రామ్ చరణ్ తో సినిమా చేస్తే ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.


