విజయ్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేయనున్న వంశీ.!

Published on Jun 1, 2021 10:09 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ థలపతి విజయ్ హీరోగా ప్రస్తుతం అక్కడి స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం విజయ్ టాలీవుడ్ అరంగేట్రానికి రంగం సిద్ధం అయ్యిపోయినట్టుగా క్లారిటీ వచ్చేసింది.

స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాత దిల్ రాజుల కాంబోలో ఈ చిత్రం ఉంటుంది అని మొన్ననే కన్ఫర్మ్ చేసేసారు. అయితే ఈ భారీ చిత్రంపై లేటెస్ట్ గా మరో బజ్ బయటకి వచ్చింది. దాని ప్రకారం ఈ చిత్రంలో విజయ్ రోల్ ను గతంలో ఎన్నడూ ఏ సినిమాకి చూపని స్టైలిష్ గా వంశీ రోల్ డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటి వరకు విజయ్ నుంచి పలు మాస్ అండ్ క్లాస్ రోల్ చూసాం కానీ కంప్లీట్ స్టైలిష్ మ్యానర్ లో చూసింది లేదు మరి ఈ చిత్రంతో అది తీరుతుందేమో అన్నది చూడాలి. అలాగే ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితులు సర్దుమణిగాక అధికారికంగా అనౌన్స్ కానుంది.

సంబంధిత సమాచారం :