ఈ స్టార్ డైరెక్టర్ కి అందుకే గ్యాప్ వస్తోందట !

Published on Jun 2, 2021 11:00 am IST

స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమాకి సినిమాకి చాల గ్యాప్ వస్తూ ఉంది. అయితే తనకు ఎందుకు అంత గ్యాప్ వస్తోందో చెప్పుకొచ్చాడు ఈ పెద్ద చిత్రాల దర్శకుడు. తను స్వతహాగా రైటర్ ను కాకపోవడం వల్లే.. స్పీడ్ గా సొంతంగా కథలు చేయలేకపోతున్నాను అని, తనకు ఒక మంచి కథ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది అని, అందుకే తనకి ఎక్కువుగా సినిమాకి, సినిమాకి మధ్య విపరీతమైన గ్యాప్ వస్తోందని వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చాడు.

మొత్తానికి వంశీ పైడిపల్లి కథల విషయంలో వేరే రైటర్ల మీద ఆధారపడుతూ వస్తున్నాడు. అయితే, వంశీకి స్క్రీన్ ప్లే మరియు టేకింగ్ అండ్ మేకింగ్ పై ఎక్కువ పట్టు ఉంటుంది. ఎలాంటి సీన్ ను అయినా కేవలం తన డైరెక్షన్ తో ఆ సీన్ ను పడించగలడు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా పెద్ద హీరోలతోనే సినిమాలు తీశాడు వంశీ. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ విజయ్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :