అక్షయ్ పక్కన వార్ బ్యూటీ.

అక్షయ్ పక్కన వార్ బ్యూటీ.

Published on Jul 2, 2020 12:50 PM IST

ది మూవీ మెషిన్ అక్షయ్ కుమార్ గత ఏడాది చివర్లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు . ఆయన దర్శకుడు రంజిత్ తివారి దర్శకత్వంలో బెల్ బాటమ్ అనే మూవీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వింటేజ్ గెటప్ లో అక్షయ్ రాయల్ లుక్ సినిమాపై ఆసక్తి రేపింది. ఈ చిత్రంలో అక్షయ్ డాన్ లేదా వ్యాపారవేత్తగా కనిపించే అవకాశం కలదు. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా వాణీ కపూర్ నటిస్తుంది.

ఈ విషయాన్నీ ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అక్షయ్ సర్ మూవీలో నటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్న ఆమె ఈ ప్రాజెక్ట్ పై బాగా ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేశారు. గత ఏడాది బాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన వార్ మూవీలో వాణి కపూర్ హృతిక్ కి జంటగా నటించారు. ఇక బెల్ బాటమ్ మూవీ 2021 సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు